PLD: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.