KMM: ముదిగొండ మండలం సువర్ణపురంలో ఓ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల ప్రత్యేక శిబిరం ఇవాళ ప్రారంభమైంది. సుమారు 50 మంది విద్యార్థులు గ్రామ వీధులు, బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి శ్రమదానం చేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.