లాస్ ఏంజిల్స్‌లో 98వ ఆస్కార్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కేవలం ఒక్క రాత్రి జరిగే ఈ ఈవెంట్ కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయడం విశేషం. 2024లో రూ.477 కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈసారి ఆ మార్కును దాటేసింది. నామినీ కార్డుల ప్రింటింగ్, లైటింగ్, అతిథుల విందు ఇలా ప్రతి విషయంలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటించడంతో ఈ వేడుక ఖర్చు ఆకాశాన్నంటుతోంది.