HYD: ఇవాళ రాత్రి పలు ఫ్లై ఓవర్లపై వెళ్లేందుకు అనుమతి లేదని సిటీ ట్రాఫిక్ చీఫ్ జోయల్ డేవిస్ తెలిపారు. షబ్-ఏ-ఖదర్-జగ్నేకి-రాత్ సందర్భంగా రాత్రి 10 గంటల తరువాత ఈ నిబంధనలు అమలవుతాయన్నారు. జూపార్క్-ఆరాంఘర్ ఫ్లై ఓవర్, బహదూర్పురా ఫ్లై ఓవర్, చంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్, డాక్టర్ అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్లపై టూ వీలర్లను అనుమతించబోమన్నారు. వాహదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.