వికారాబాద్: జిల్లాలో జన గణనను ఖచ్చితత్వంతో, పక్కా ప్రణాళికతో నిర్వహించాలని జడ్పీ సీఈవో సుధీర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి వివరాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.