BDK: రంజాన్ మాసం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాషా, మేయర్ గణేష్ అన్నారు. ఆదివారం రామవరం 14వ నెంబర్ మదీన మసీద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతన, కఠిన ఉపవాస దీక్షలు జీవనశైలికి రంజాన్ మాసం వేదికని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు శాంతి శ్రేయస్సులో భాగస్వాములు కావాలని కోరారు.