KKD: గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ గ్యాస్ ఏజెన్సీల డీలర్లను హెచ్చరించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్లో పౌరసరఫరాలు, లీడ్ బ్యాంక్ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్‌తో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.