AP: శ్రీసిటీలో పారిశ్రామికవేత్తలతో మంత్రి గొట్టిపాటి సమావేశమయ్యారు. శ్రీసిటీలో 31 దేశాల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ‘శ్రీసిటీ ప్రత్యక్షంగా 70 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మరో లక్షన్నర మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. దేశంలోనే తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను ట్రూడౌన్ చేశాం. పెట్టుబడిదారులకు విద్యుత్ రాయితీలు ఇస్తున్నాం’ అని వెల్లడించారు.