SRH యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ తన అద్భుత బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ సీజన్లో 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మొత్తంగా 72 బంతులు (12 ఓవర్లు) వేసిన సాకిబ్, 85 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ 72 బంతుల్లో ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కాగా, అతడు ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ SRH గెలిచింది.