KNR: కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న ఊట్ల మల్లయ్యకు అత్యవసరంగా రక్తం అవసరం కాగా, బెజ్జంకికి చెందిన బొమ్మిడి సాయికృష్ణ స్పందించారు. రాష్ట్ర మేదరి యువజన సహాయ కార్యదర్శి అయిన ఆయన ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సాయికృష్ణకు ఇది 13వ సారి రక్తదానం కావడం విశేషం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం తన బాధ్యతని ఆయన పేర్కొన్నారు.