NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామానికి కొత్తగా 26 ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఎంపీడీవో కొండయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, నాయకులు సిద్దు, మల్లేశ్, రాము, కేశవులు పాల్గొన్నారు. పేదలకు గృహవసతి కల్పించేందుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని వారు అధికారులను కోరారు.