ATP: జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు వేగంగా సాగుతోందని ఎస్ఈ శేషాద్రిశేఖర్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 11,368 కొత్త కనెక్షన్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో అత్యధికంగా కనెక్షన్లు ఇచ్చామన్నారు. పెండింగ్లో ఉన్న 8,464 కనెక్షన్లను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.