TPT: నారాయణవనం మండలం తుంబూరులో రూ.35 లక్షలతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమిపూజ చేశారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న టీడీపీ నేత సుబ్రమణ్యంను పరామర్శించారు. తదుపరి నారాయణవనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈ టీకాతో క్యాన్సర్‌ను నివారించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.