AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయం, HOD టవర్ల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, మెకానికల్ పనుల కోసం రూ.2,316 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. అమరావతి అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి సృష్టి, వ్యవసాయం, విద్యుత్, పర్యాటకంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే, CRDA నిర్ణయాలను ఆమోదించింది.