»Shiv Sena To Contest 119 Assembly Seats In Telangana
Telangana:లో 119 అసెంబ్లీ స్థానాల్లో శివసేన పోటీ.. జర్నలిస్టులు, నిరుద్యోగులకు టిక్కెట్లు!
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 119 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ శుక్రవారం తెలిపారు. కొన్ని స్థానాల్లో జర్నలిస్టులను కూడా పార్టీ బరిలోకి దించుతుందని ఆయన వెల్లడించారు.
త్వరలో తెలంగాణ(telangana)లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన(Shiv Sena) పార్టీ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయనుంది. బోధన్‌లో జరిగిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ ఈ మేరకు వెల్లడించారు. జిల్లా పేరును ఇందూరుగా మార్చేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని శివసేన నాయకత్వం నిర్ణయించినట్లు తెలంగాణ అధ్యక్షుడు సింకారు శివాజీ తెలిపారు. మహారాష్ట్రలో కేసీఆర్ ప్రభావం చూపే అవకాశమే లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు హిందూ మతంపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. హిందుత్వ రక్షణకు మద్దతిచ్చే వారికి శివసేన మద్దతు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పార్టీ అసెంబ్లీ టిక్కెట్లు కేటాయిస్తుందని, అలాగే మహిళలకు(womens) 33 శాతం టిక్కెట్లను రిజర్వ్ చేస్తామన్నారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు టిక్కెట్లతో పాటు యువత, నిరుద్యోగులకు కూడా టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. బీసీలకు 50 శాతం టిక్కెట్లు వస్తాయని చెప్పారు. కొన్ని స్థానాల్లో జర్నలిస్టులను కూడా పార్టీ బరిలోకి దించుతుందని ఆయన తెలిపారు. శివసేన పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని జిల్లాల్లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు శివాజీ వెల్లడించారు.