GDWL: ఇటిక్యాల మండలం మునగాల జడ్పీహెచ్ఎస్ను DEO విజయలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లి విద్యా బోధనను పర్యవేక్షించడమే కాకుండా, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఉపాధ్యాయులు బోధనలో నాణ్యత పాటించాలని సూచించారు.