TG: చర్లపల్లిలోని ప్రధాన గ్యాస్ నింపే కేంద్రాల్లో ఇంధన సరఫరా తగ్గింది. BPCL, HPCL, IOCL సంస్థల నుంచి ఇంధన సరఫరా 75 శాతం తగ్గిపోవడంతో గ్యాస్ లారీల రాకపోకలు నిలిచిపోయాయి. చర్లపల్లిలోని 3 ప్రధాన ప్లాంట్ల నుంచి TGతో పాటు AP, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా చమురు, గ్యాస్ సరఫరా అవుతోంది. తాజాగా సరఫరా తగ్గడంతో ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాహనాలు ప్లాంట్ల వద్దే బారులుతీరాయి.