కోనసీమ: దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేస్తోంది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, పుదుచ్చేరిలోని యానాం ప్రాంతానికి ఎ. తోట రాజును పార్టీ ఇన్ఛార్జ్గా నియమించింది.