VZM: శ్రీ రామనారాయణంలో ద్వాదశ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో అన్ని దేవత మూర్తులకు 108 నదీ జలాలతో అష్ట కలశ స్నపన పూజలు జరిగాయి. ఈ సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నారాయణ శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు, శ్రీ నారాయణం సీతారామయ్య, పద్మశ్రీ దంపతులు,చంద్రకళ, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.