ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామంలో బస్‌స్టాప్ నుంచి పాఠశాల వరకు జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఒంగోలు ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో, నిర్దేశిత కాలపట్టికలో పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.