VKB: పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కుకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన దీక్ష నేడుకు 26వ రోజుకు చేరుకుంది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కొని మమ్మల్ని రోడ్డున పడేయొద్దంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలే తమకు జీవనాధారమని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని నినాదాలతో హోరెత్తించారు.