NZB: జిల్లా వంజరి సంఘం అధ్యక్షుడిగా మాస్టర్ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ జిల్లాలోని వంజరి సంఘం కళ్యాణ మండపంలో జిల్లా వంజరి సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యవర్గ సభ్యులంతా మాస్టర్ శంకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీ కమిటీ ఏర్పాటు చేసి, సంఘ అభివృద్ధికి పాటుపడతానన్నారు.