ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ మండలం కొత్తపేట్ సర్పంచ్ పల్లవి-నరేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని పేర్కొన్నారు.