KMM: చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ మీరా పొలం పనులకు వెళ్లిన సమయంలో ఎండ తీవ్రత కారణంగా, వడదెబ్బకు గురై మరణించినట్లు స్థానికులు తెలిపారు. వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిన సమీప ఆసుపత్రికి, తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.