AKP: దేవరాపల్లి మండల కేంద్రంలోని హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్య నివారణకు ఎస్సై వి.సత్యనారాయణ ఆదివారం చర్యలు చేపట్టారు. రోడ్డు మార్జిన్లలో విక్రయాలు చేయవద్దని వ్యాపారులను అప్రమత్తం చేశారు. మార్కెట్ ఆవరణలోనే అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.