అన్నమయ్య: రాజంపేట పట్టణం భువనగిరిపల్లి సమీపంలో ఒడిశాకు చెందిన సుమీ సుస్మిత (18) అనే యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నావని మందలించడంతో మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.