ADB: సారంగాపూర్ మండలం స్వర్ణ ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతి గృహాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భోజనానికి ఉపయోగించే ఆహార పదార్థాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు.