BDK: పినపాక నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నారు.