GDWL: గట్టు మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా నా వంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు.