CTR: ఇనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 6 వేల ఎకరాలకు విముక్తి కలగనుంది. చిత్తూరులో 358.91, తిరుపతిలో 1950.34 అన్నమయ్య జిల్లాలో 3929.95 ఎకరాల చొప్పున ఇనామ్ భూములు ఉన్నాయి. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.