విజయనగరం నుంచి ఎస్.కోట ప్రయాణించిన ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులో తన సూట్‌కేసును మరిచిపోయాడు. ఈ పొరపాటును ఇంటికి వెళ్ళాక గుర్తించి, వెంటనే ఎస్.కోట డిపో అధికారులను ఆశ్రయించారు. స్పందించిన ఎస్టీ జీ.ఎం.రావు బస్సును తనిఖీ చేసి సూట్‌కేసును అతనికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుడు వారికి కృతజ్ఞతలు తెలిపారు.