సుబ్బారెడ్డి వెనుక అధికార పార్టీ ఉందని తెలుస్తోంది. ఈ కారణంగా అతడికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఆమెపై పోలీసులు కక్షపూరితంగా.. దౌర్జన్యానికి దిగారని చర్చ కొనసాగుతోంది.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై (Bhuma Akhila Priya) జరుగుతున్న పరిణామాలు ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో (Kurnool District) కలకలం రేపుతున్నాయి. ఆమెపై కక్షపూరిత చర్యలు జరుగుతున్నాయని సమాచారం. తెలుగుదేశం పార్టీలో (Telugu Desam Party) ఉన్న గ్రూపు రాజకీయాలకు అధికార వైసీపీ అండగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై పోలీసులు (Police) కక్షపూరితంగా.. దౌర్జన్యానికి దిగారని చర్చ కొనసాగుతోంది. ఈ ఆరోపణలకు బలోపేతం చేసేలా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను తీహర్ జైల్లో ఉంచినా.. ఆళ్లగడ్డ (Allagadda) ఎమ్మెల్యేగా గెలుస్తా’ అని ధీమా వ్యక్తం చేశారు. తనపై పోలీసులు పాల్పడుతున్న చర్యలపై అఖిలప్రియ స్పందించారు.
‘నన్ను ప్రజల్లోకి వెళ్లకుండా.. ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలోనే నాపై అక్రమ కేసులు (Fake Case) పెట్టారు. ఏవీ సుబ్బారెడ్డి (AV SubbaReddy) చున్నీ లాగారని నేను ఫిర్యాదు చేస్తే పోలీసులు నన్నే అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే హోం మంత్రి పదవిని మహిళకే ఇవ్వాలి. అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చాను. తిహార్ జైల్లో (Tihar Jail) ఉంచినా కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాను’ అని భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు.
సుబ్బారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘సుబ్బారెడ్డి పార్టీలో ఉంటే ఈ నాలుగేళ్లు ఏం చేశారో చెప్పాలి? పార్టీలో ఉన్న గుంటనక్కల గురించి నారా లోకేశ్ (Nara Lokesh) చూసుకుంటారు. ఎన్ని కేసులు బనాయించినా ఆళ్లగడ్డ ప్రజలకు అండగా ఉంటా’ అని అఖిలప్రియ స్పష్టం చేశారు. కాగా, కర్నూలు జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సందర్భంగా పార్టీలో వర్గ రాజకీయాలు భగ్గుమన్నాయి. సుబ్బారెడ్డి, అఖిలప్రియ అనుచరుల మధ్య వివాదం ఏర్పడింది. అఖిలపై కేసులు నమోదై ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ (Bail)పై బయటకు వచ్చారు. వీరి మధ్య వివాదం మరింత ముదురుతోంది. కాగా, సుబ్బారెడ్డి వెనుక అధికార పార్టీ ఉందని తెలుస్తోంది. ఈ కారణంగా అతడికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.