SKLM: లావేరు మండలంలోని బుడుమూరు దగ్గర జాతీయ రహదారి పై 8 పశువులను సోమవారం లావేరు పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకొని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.అప్పలసూరి తెలిపారు. అక్రమంగా పశువులను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.