ములుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం వెంకటాపూర్ మండలం నల్లగుంట, ఎల్లారెడ్డిపల్లె గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. మంజూరైన ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేసి ఉగాది వరకు గృహప్రవేశాలు చేపట్టాలన్నారు.