TG: వేసవిలో ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి నుండి మే వరకు ఏసీ బస్సుల్లో టికెట్ ధరలను 20 నుండి 30 శాతం తగ్గించనున్నారు. 50 పుష్పక్, 40 సిటీ ఏసీ బస్సుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. 60 శాతం ఉన్న ఆక్యుపెన్సీని 100 శాతానికి పెంచడమే లక్ష్యంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరికొన్ని కొత్త ఈవీ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి.