గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడి భారంగా మారడంతో ఈ ఖర్చును తగ్గించుకోవడానికి చాలా మంది ఇండక్షన్ కుక్కర్లను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. గ్యాస్ పొయ్యితో పోలిస్తే, ఇండక్షన్ స్టవ్ వాడటం వల్ల దాదాపు 30 నుండి 40 శాతం వరకు ఖర్చు ఆదా అవుతుంది. ఈ పొదుపు కారణంగానే మార్కెట్లో ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.