ASF: అడవి సంపదకు నిప్పు పెట్టడం మానవజాతికి ముప్పు కల్గిస్తుందని జోడేఘాట్ FRO రమేష్ హెచ్చరించారు. పశువుల కాపర్లు, బాటసారులు అజాగ్రత్తగా పడేసే నిప్పు వల్ల అడవితో పాటు వన్యప్రాణులు దహించుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కెరమెరి మండలం జోడేఘాట్ రేంజ్లో పలు బీట్లలో రాజుకున్న మంటలను అధికారులు, సిబ్బందితో కలిసి ఆర్పేశారు.