అన్నమయ్య: పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం జమీందారుల తొలిపూజతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని సుగుటూరు గంగమ్మ, విరూపాక్షి మారెమ్మ ఆలయాలతో పాటు మిగిలిన ఆరు గంగమ్మల ఆలయాల్లో సోమవారం జాతర ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహించే జమీందారీ ప్యాలెస్ ఆవరణలో రంగులు దిద్ది, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చలువపందిళ్లు వేసి విద్యుద్దీపాల అలంకరణ చేపట్టారు.