KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న శ్రీ భక్త సంజీవరాయ స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. మంగళవారం కావడంతో స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.