Refit Global : సంకల్పం ఉన్నచోటే మార్గం ఉంటుందని అంటారు. సాకేత్ సౌరవ్(Saket Sourav), అతని స్నేహితుడు అవ్నీత్ సింగ్(Avneet Singh) పూర్తిగా ప్రత్యేకమైన ఆలోచనతో ఒక స్టార్టప్(Startup)ను ప్రారంభించారు. వీరిద్దరి స్టార్టప్ అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంది. ఆరు సంవత్సరాలలో రూ.200 కోట్ల వ్యాపారాన్ని స్థాపించారు. ఈ ఇద్దరూ సెకండ్ హ్యాండ్ టెక్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించారో మరియు రీఫిట్ గ్లోబల్ అనే తమ స్టార్టప్‌ను ఎలా ప్రారంభించారో తెలుసుకుందాం
ఈ స్టార్టప్ న్యూఢిల్లీ(New Delhi)లో ఉంది. నేడు ఇది ఒక బ్రాండ్(brand)గా స్థిరపడింది. వీరిద్దరూ 2017లో రీఫిట్ గ్లోబల్‌ను ప్రారంభించారు. ఉపయోగించిన మొబైల్ ఫోన్లు(mobile phones), ఎలక్ట్రానిక్ ఫోన్లను అమ్ముతారు. కంపెనీ వ్యవస్థాపకులైన.. సాకేత్ సౌరవ్ ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఉద్యోగంపై ఆసక్తి చూపలేదు. చాలా పెద్ద కంపెనీల్లో పనిచేసిన సౌరవ్‌కి ఏదైనా డిఫరెంట్‌గా చేయాలని అనుకున్నాడు. ఈ కారణంగా, అతను ఆరేళ్ల తర్వాత ఉద్యోగం మానేశాడు. సాకేత్ సౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మీడియా నుండి MBA చేసాడు. 2017 సంవత్సరంలో అతను తన ఉద్యోగాన్ని వదిలి వేరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు, అతనికి అతని స్నేహితుడు అవ్నీత్ సింగ్ మద్దతు లభించింది. ఇద్దరూ పాత మొబైల్స్ అమ్మే వ్యాపారం చేయాలని భావించి రీఫిట్ గ్లోబల్ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు.
మొబైల్స్ ఎక్కడి నుంచి కొంటారు ?
యువర్‌స్టోరీ వెబ్సైట్ నివేదిక ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి రీఫిట్ గ్లోబల్ ఎక్స్ఛేంజ్ ఫోన్లను కొనుగోలు చేస్తుంది. దీని తరువాత, ఈ సంస్థ పాత మొబైల్ ఫోన్లలో ఏవైనా సాంకేతిక లోపాలు, ఇతర సమస్యలు తలెత్తితే వాటిని రిపేర్ చేసి దాన్ని తీసివేసి మళ్లీ ఫోన్‌ని సిద్ధం చేసింది. ఆ తర్వాత, వివిధ మార్గాల ద్వారా ఈ మొబైల్ ఫోన్లను విక్రయిస్తుంది. దీని వల్ల కంపెనీ చాలా లాభపడుతోంది. వాస్తవానికి, పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే కంపెనీ, వాటి నాణ్యతను 37 పాయింట్లపై పరీక్షిస్తుంది. దీని తరువాత ఆ ఫోన్ పూర్తిగా బాగానే ఉందని భావించినప్పుడు దానిని మళ్లీ అమ్ముతుంది.
గతేడాది 5 లక్షల పాత ఫోన్ల విక్రయం
రీఫిట్ గ్లోబల్ 2022 సంవత్సరంలో 5 లక్షల పాత మొబైల్ ఫోన్లను విక్రయించింది. 2021-22 సంవత్సరం నాటికి కంపెనీ ఆదాయం 100 కోట్లకు చేరుకుందంటే ఆ కంపెనీ ఎంత వేగంగా సక్సెస్‌ని రుచిచూసిందో అర్థం చేసుకోవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 200 కోట్ల ఆదాయాన్ని పొందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.350 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని.. కొత్త మొబైల్ ఫోన్ల కంటే తన మొబైల్ ఫోన్లు 70 శాతం వరకు చౌకగా ఉన్నాయని సాకేత్ సౌరవ్ తెలిపారు.