ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్గా సుబ్రహ్మణ్యం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఆయన పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సిబ్బందితో సమావేశమై శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.