VZM: ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రిజిష్ట్రేషన్, రవాణా, గనులు భూగర్భ ఖనిజశాఖ, ఎక్సైజ్, అటవీ, వాణిజ్య పన్నుల తదితర ఆదాయ సముపార్జన శాఖల అధికారులతో కలెక్టర్ ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ, ప్రతి శాఖ ప్రగతిని ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.