ELR: సోమవారం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా జడ్జి అడబాల లక్ష్మి మాట్లాడుతూ.. ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్లు అమలైతే శ్రామిక మహిళలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.