అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. చమురు బ్యారెల్ ధర కేవలం 10 డాలర్లు పెరిగితే ఏడాదికి మన చమురు దిగుమతుల బిల్లుపై దాదాపు రూ.1.5 లక్షల కోట్లు భారం పడుతుంది. బ్యారెల్ చమురు ధర 150 డాలర్లకు చేరితే, మనపై ఇంకెంత ప్రభావం పడుతుందో! యుద్ధం ఆగకపోతే రూపాయి మారకపు విలువ ఇంకెంత క్షీణిస్తుందోనన్న భయాలు చుట్టుముడుతున్నాయి.