TPT: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 15న శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పుష్పయాగం జరుగుతుంది. గృహస్తులు రూ. 516 చెల్లించి టికెట్ తీసుకుని పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. 15న నిత్య కళ్యాణోత్సవ సేవను టీటీడీ రద్దు చేసింది.