కడప: 2వ డివిజన్, చలమారెడ్డిపల్లికి చెందిన మాజీ YCP కార్పొరేటర్ ఓర్సు బాలకొండయ్య ఆధ్వర్యంలో సోమవారం 300 కుటుంబాలు TDPలో చేరాయి. పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, MLA మాధవి రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయకత్వం, కడప అభివృద్ధిపై నమ్మకంతోనే ఈ చేరికలు జరిగాయని, పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు.