CTR: ఏడుగురు గ్రామ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీచేస్తూ జిల్లా సర్వే భూరికార్డుల శాఖ ఏడీ పుల్లయ్య ఉత్తర్వులు జారీ చేశారు. తోటి సర్వేయర్లను విధులకు హాజరు కానీయకుండా చేశారనే కారణంతో సర్వేయర్ల యూనియన్ ఆఫీస్ బేరర్స్లోని నాయకులకు షోకాజ్ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో గతంలో ముగ్గురు సర్వేయర్లను సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.