ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరచిన గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని కలెక్టర్ కె. హరిత తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి EVM గోదాంను పరిశీలించారు. గోదాం వద్ద 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, CC కెమెరాల పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు.