ADB: రైతుల పండించిన మొక్కజొన్న, శనగ పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా రైతు సంఘం నాయకుడు బండి దత్తాత్రీ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతిని కలిసి వినతి పత్రం అందజేశారు. అన్నదాతలు ప్రైవేటు వ్యాపారస్తులకు పంటలను విక్రయించడం ద్వారా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.