KRNL: ఆదోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ను ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ఇవాళ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మహిళలకు అత్యవసర సహాయం అందించే ఉమెన్ హెల్ప్ లైన్-181, పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ లైన్-1098 సేవలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.